బీజేపీ నేతలపై కేటీఆర్

41
ktr supports visaka steel fight
ktr supports visaka steel fight

ktr fired bjp leaders

బీజేపీ నేతల తీరుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కులాలను వర్గాలుగా విడదీసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఒక్క ఎన్నిక కోసం బీజేపీ నేతలు పిచ్చిలేచినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఓట్ల కోసం బండి సంజయ్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. బండి సంజయ్ కు ఓట్లు కావాలంటే ప్రజల కాళ్ళు పట్టుకుంటే వేస్తారు కదా? సర్జికల్ స్ట్రైక్ చేస్తారా అని నిలదీశారు. మనం హైదరాబాద్ లో ఉన్నామా లేదంటే ఎక్కడ ఉన్నామో అర్థం కావడం లేదు బీజేపీ వాళ్ళ మాటలు చూస్తుంటే అని అభిప్రాయపడ్డారు. ఇవ్వాళ హైదరాబాద్ ప్రజలుగా కలవాల్సిన సమయం వచ్చిందని, పచ్చని తెలంగాణ లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here