ఏపీ సీఎం చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్

KTR FIRED ON CHANDRA BABU NAIDU

ఎక్కడ ఏ చిన్న సందర్భం దొరికిన కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరుగుతున్నారు. సీఎం కేసీఆర్ ను అనుసరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసిఆర్ బాటలో నడవాలని ఎంత ప్రయత్నం చేసినా చంద్రబాబుకు సాధ్యమయ్యే పని కాదని ఎద్దేవా చేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ తరహా వ్యూహంతో ముందుకెళుతున్నారని అయినా ఏపీ ప్రజలు చాలా తెలివిగా తీర్పును ఇస్తారని కేటీఆర్ అంటున్నారు.ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి అభినందన సభలో బాబుపై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న పథకాలనే యథాతథంగా ఆంధ్రప్రదేశ్‌‌లో అమలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏం చేస్తే తాను కూడా అవే చేస్తే గెలుస్తానని చంద్రబాబు అనుకుంటున్నారని అన్నారు. చిత్తశుద్ది లేని శివపూజలు చేస్తే ఏం జరిగేది లేదని కేటీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అక్కడి జర్నలిస్టులు చాలా తెలివైన వాళ్లు, చైతన్యవంతులని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు.

TELANGANA NEWS ANALYSIS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article