నగర రోడ్లపై కేటీఆర్ సమీక్ష…

KTR holds review meeting on footpath

హైదరాబాద్ నగర రోడ్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నగర్ రోడ్ల విస్తరణతో పాటు పాదాచారులకు అనుగుణంగా సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిదంగా.. వాక్‌-వేలను మరింత విస్తరించడంతోపాటు రహదారులను, ఫుట్‌పాత్‌లను కొత్తగా ఏర్పాటుచేయాలని అన్నారు. ఇకనగర పరిధిలో 100 పాదచారుల వంతెనల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని అయితే ఆ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరారు. అదేవిదంగా బస్‌ బేలు, బస్‌షెల్టర్ల నిర్మాణం కూడా త్వరగా పూర్తిచేయాలని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇక ఇటీవల బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంపై కూడా మంత్రి మాట్లాడారు. ఆ ఫ్లైఓవర్ మీద మరింత రక్షణ చర్యల ఏర్పాటుకు రంగం సిద్ధం చేయాల్సిందిగా కేటీఆర్ సమీక్షలో ఆదేశించారు. అదేవిదంగా..బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ డిజైన్‌, ప్రమాద నివారణకు తీసుకునే చర్యలపై మూడురోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు మంత్రి.

KTR holds review meeting on footpath,Hyderabad Roads,Biodiversity accident,Hyderabad Footpath,Busway,Wlakway,minister Ktr,GHMC,Ktr Meeting With GHMC

Related posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *