కేటీఆర్ కీ ట్రా‘ఫికర్’ తప్పలేదు

100
ktr sign forgery
ktr sign forgery

KTR IN TRAFFIC JAM

హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్రాఫిక్ మూవ్ మెంట్ కి చిన్న అవరోధం ఏర్పడినా చాంతాడంత పొడవున వాహనాలు నిలిచిపోతాయి. ఇక వర్షం వస్తే నరకమే. హైదరాబాదీయులకు ఇది కొత్త కాదు. అయితే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. బుధవారం సాయంత్రం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన ఆయన.. భారీ వర్షం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోయారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ ఎంసీ అధికారులు ఆగమేఘాల మీద స్పందించి కేటీఆర్ కాన్వాయ్ కి లైన్ క్లియర్ చేశారు. పాడైపోయిన రోడ్లతో, నిత్యం ట్రాఫిక్ జాంలతో సతమతమయ్యే హైదరాబాద్ ప్రజల బాధలు ఆయన నేరుగా చూశారు. ప్రతిరోజూ తాము పడుతున్న కష్టాలు చూసినందున వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

TS NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here