ప్రజలకు మనమేమీ బాకీ లేమంటూ  నేతలకు చెప్పిన కేటీఆర్

107
IT Means Intelligence Technology
IT Means Intelligence Technology

KTR intresting comments on telangana peoples

ప్రజలనుద్దేశించి  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ప్రజలకు మనమేమీ బాకీ లేమంటూ  నేతలకు తేల్చిచెప్పారు. సంక్షేమ పథకాలు అందటం లేదని  ప్రజలు ప్రజా ప్రతినిధులను, అధికారులను నిలదీస్తున్నారని ,  గొడవకు దిగుతున్నారని జడ్పిటిసి సభ్యులు కేటీఆర్ కు విన్నవించారు.  ఇక దీనిపై స్పందించిన కెటీఆర్  ప్రజలకు మనమేమీ  బాకీ లేమని  తేల్చిపారేశారు.  ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నవి ప్రోత్సాహకాలేనని, వారికేమీ మనం బాకీ లేమని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  చేసిన వ్యాఖ్యలు  ఇప్పుడు  తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి .
సిరిసిల్ల జెడ్పీటీసీ సభ్యులతో  కేటీఆర్  మాట్లాడారు. అతి విశ్వాసం వల్ల కరీంనగర్ ఎంపీ సీటును కోల్పోయామని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఇక  ఇదే సమయంలో  కేటీఆర్ తాజా  వ్యాఖ్యలు చేశారు. పలానా పథకం తమకు అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే  ప్రజా ప్రతినిధులు,  అధికారులు వారికి నచ్చచెప్పాలని  సూచించారు. వారితో గొడవకు దిగొద్దని  కేటీఆర్,  ఇక  ప్రజా ప్రతినిధులను,  ప్రజలను ఉద్దేశించి ఈ విషయంలో అధికారులను నిలదీయవద్దని వారికీ భార్య, పిల్లలు ఉంటారని పేర్కొన్నారు.
మరుగుదొడ్ల నిర్మాణం, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు మాత్రమేనని,  ప్రోత్సాహకాలు ఉన్నంత మాత్రాన  అవి ప్రజలకు బాకీ పడిన  సొమ్ము కాదని  ఆయన పేర్కొన్నారు.  ప్రజలకు మనమేమీ బాకీ లేమని,  సంక్షేమ పథకాలు అందించినంత మాత్రాన ప్రజలకు బాకీ ఉన్నట్టు కాదని పేర్కొన్నారు. అవగాహనతో అధికారులను ప్రశ్నిస్తే గౌరవం పెరుగుతుందని,   లొల్లి చేస్తే పేపర్లో ఫొటోలు మాత్రమే వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.  కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలపై  పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

AP NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here