KTR is a Rare Honor In Davos
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కే. తారకరామారావుకి అరుదైన గౌరవం దక్కింది. గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ (IGWEL) సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం వరల్డ్ ఎకనామిక్ ఫోరం పంపింది. కీపింగ్ పేస్ టెక్నాలజీ- టెక్నాలజీ గవర్ననెన్స్ ఏట్ క్రాస్ రోడ్స్ పేరుతో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వాధినేతలు, కేంద్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వ పాలసీ నిర్ణయించే సీనియర్ మంత్రులు మాత్రమే సాధారణంగా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర స్థాయి ఆహ్వానితుల్లో కేటీఆర్ ఒక్కరే ఉండడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. ఈ సమావేశం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక బ్యాడ్జ్ ను అందించింది.
ఈ సమావేశం ప్రపంచ లీడర్లందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి వివిధ అంశాలపైన మాట్లాడుకునే అవకాశాన్ని వరల్డ్ ఎకానామిక్ ఫోరం కల్పిస్తుంది. ఇందుకోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, సీనియర్ కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సెర్బియా ప్రధానమంత్రి Ana Brnabić, పోలాండ్ ప్రధాని Mateusz Morawiecki, ఈస్టోనియా Jüri Ratas ప్రధాన మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్రెజిల్, సింగపూర్, కొరియా, ఇండోనేషియా, బోట్స్ వానా, ఒమన్, ఇథియోపియా దేశాలకు చెందిన పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.