తెలంగాణ డెవలపర్లకు కేటీఆర్ ఝలక్?

KTR Jhalak for Telangana developers?

భవన నిర్మాణ అనుమతుల్లో తెలంగాణ విధానం దేశంలోని అత్యుత్తమ విధానాల్లో ఒకటి అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల విషయంలో పారదర్శక విధానాలకు శ్రీకారం చుట్టామని, ఇందుకోసం మెత్తం ప్రక్రియను అన్ లైన్ చేస్తూ, మరింత పారదర్శకంగా ఉండే విధానాన్ని రూపకల్పన చేస్తున్నామన్నారు. ఈరోజు రియల్ ఏస్టేట్ సంఘాలు మంత్రి కేటీఆర్ ను పురపాలక కాంప్లెక్స్ లోని మంత్రి కార్యాలయంలో కలిశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్డింగ్ అనుమతుల ప్రక్రియను వారికి మంత్రి తెలియజేశారు. ఈ ప్రక్రియ పైన క్షేత్రస్ధాయిలో ఉన్న స్పందనను అడిగి తెలుసుకున్నారు. దీన్ని మరింత సులభతరం చేసేందుకు, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల బృందం అధ్యయనం చేస్తున్నదని, బిల్డర్ల సంఘాల నుంచి ఒకరిద్దరు ప్రతినిదులు అధికారులతో కలసి పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలో ఉన్న బిల్డింగ్ అనుమతుల విధానాలను పరిశీలించి, అత్యుత్తమ విధానంగా మార్చేందుకు సూచనలు చేయాలన్నారు.

ఇప్పటికే అన్ని మున్సిపల్ విభాగాల్లో ఈ-అఫీస్ సాప్ట్ వేర్ ఉపయోగిస్తున్నామన్నారు. ఈ విధానంలో ఫైళ్ల అనుమతులు ఏదశలో ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుస్తుందని, దీంతో అనుమతులు అలస్యం అయ్యే అవకాశం లేదన్నారు. దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం వృద్ది దిశలో కొనసాగుతున్నదన్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ర్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేక విధానపరమైన చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. వేలాది మందికి ఉపాది కల్పించే భవన నిర్మాణ రంగానికి, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం సహకరిస్తుందని, అదే సమయంలో నిభందనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే అంతే కఠినంగా చర్యలు ఉంటాయన్నారు.

నగరంలో ఇప్పటికే భవన నిర్మాణ వ్యర్ధాల రిసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, నిర్మాణ వ్యర్ధ్యాలను చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో వేస్తే చర్యలు తప్పవన్నారు. దీంతోపాటు భవన నిర్మాణ నిబంధనలు పాటించేలా చూడాలని, ఈ దిశగా సంఘాలే తమ భాగస్వాముల్లో మరింత చైతన్యం చూపాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ డ్రాప్ట్ టౌన్ షిప్ పాలసీని అన్ని బిల్డర్ సంఘాలకు అందిస్తామని, దానిపైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. నగర అభివృద్ది నలుదిశలా విస్తరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని, ఇందుకోసం బిల్డర్లు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. పశ్చిమ హైదరాబాద్ నగరం ఇప్పటికే కంపెనీలతో నిండిపొయిందని, జనసాంద్రత పెరిగిన నేపథ్యం ఇతర ప్రాంతాలకు కంపెనీలు వచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న మంత్రి, అయా ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. రియల్ ఎస్టేట్ సంఘాలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా జియచ్ యంసి తో కలిసి పని చేయాలని మంత్రి కోరారు.

Telangana Real Estate News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *