KTR Launches Pattana Pragathi at Devarakonda
మంత్రి కేటీఆర్ తన మార్క్ చూపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి దేవరకొండలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేవరకొండలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దేవరకొండ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రూ. 48.2 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నెట్వర్క్, రోడ్లు, పార్క్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.. ఇక అక్కడ చెత్తా చెదారం ఎక్కడివి అక్కడే పేరుకుపోవటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . పారిశుధ్య పనులపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిందని మున్సిపల్ కమిషనర్, చైర్మన్, కౌన్సిలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి జరిమానా విధించాలని అధికారులకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.