మున్సిపల్ ఎన్నికల్లో అసంతృప్త: కేటీఆర్ వ్యూహం

161
government will control school fees
government will control school fees

KTR On Municipal Polls

తెలంగాణలో జరుగుతున్నమున్సిపల్ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ ఫోకస్ పెంచింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. అభ్యర్థులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరును ఆయన తెలుసుకుంటున్నారు. అదే సమయంలో కొన్నిచోట్ల రెబల్స్‌ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశంపైనా కేటీఆర్‌ దృష్టి సారించారు. ప్రచార వ్యూహాలపై అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు. అసంతృప్త నేతలను కలుపుకొని పోవాలని అభ్యర్థులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అలసత్వం వహించొద్దని తేల్చిచెప్పారు. గురువారం మున్నిపల్ ఎన్నికల అభ్యర్థులతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రచార సరళి గురించి కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులకు వివరించారు. అన్ని చోట్ల గులాబీ జెండా ఎగరెయ్యాలని సూచించారు. అసంతృప్త నేతలతో కలిసి ప్రచారం చేయాలని చెప్పాటు కేటీఆర్ .  ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నేతలు ఎన్నికలను ఏకగ్రీవం చేస్తున్న విషయం తెలిసిందే .

KTR On Municipal Polls,Municipal elections , trs party . kcr, ktr, rebals , tra working president , focus,Telangana municipal polls,#KTR,#TRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here