తాను బ్రతికే ఉన్నానని కేటీఆర్ ట్వీట్.

Spread the love

KTR tweets He is Alive.. రీజన్ ఇదే

అభిమానం ఉండొచ్చు కానీ అభిమానంతో తాము ఏమి మాట్లాడుతున్నాము మర్చిపోతే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ఇబ్బంది నే ఫేస్ చేశారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక అభిమాని కేటీఆర్ పై వల్లమాలిన అభిమానం తో చేసిన ట్వీట్ కేటీఆర్ తాను బ్రతికి ఉన్నాను అని క్లారిటీ ఇచ్చే లాగా చేసింది.
తాను ఇంకా బతికే ఉన్నానని తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. అదేంటి..? కేటీఆర్ ఇలా ట్వీట్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా..? ఓ నెటిజన్ అత్యుత్సాహంతో చూపించిన ప్రేమకి కేటీఆర్ ఇలా బదులిచ్చారు.
ఇంతకీ మ్యాటరేంటంటే… యువతలో కేటీఆర్ కి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ అభిమానంతోనే ఓ యువకుడు ఆయన పేరు ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో జై కేటీఆర్ కి బదులు.. పొరపాటున జోహార్ కేటీఆర్ అంటూ ట్వీట్ చేశారు.
కాగా.. ఆ ట్వీట్ కి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘బ్రదర్… నేను ఇంకా బతికే ఉన్నాను. అప్పుడే జోహార్ క్లబ్ లో చేరలేదు’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా.. ట్వీట్ వైరల్ గా మారింది. ఎప్పుడైతే ట్వీట్ వైరల్ అయ్యిందో.. ఆ నెటిజన్ తాను చేసిన పొరపాటును గ్రహించారు. వెంటనే తన ట్వీట్ ని డిలీట్ చేయడం విశేషం. కానీ కేటీఆర్ చేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

One thought on “తాను బ్రతికే ఉన్నానని కేటీఆర్ ట్వీట్.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *