కేటీఆర్ కళ్లు తెరవాలి

27
KTR FOCUS ON JOURNALIST ISSUES
KTR FOCUS ON JOURNALIST ISSUES

KTR Should Open Eyes

దుబ్బాక ఓటమి బీజేపీలో సరికొత్త ఉత్సాహం నింపడమే కాదు అధికార పార్టీకి పెను సవాల్ విసిరింది. ఇప్పటివరకూ తమకు తిరుగే లేదని భావించిన కేసీఆర్ అండ్ టీముకి ప్రజలు టీఆర్ఎస్ పాలన పట్ల వ్యతిరేకంగా ఉన్నారని రుజువైంది. ఈ విజయంతో బీజేపీ పార్టీ వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో సమరనాదం మోగిస్తున్నది. ఈ విజయం గురించి ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారంటే, ఆ ఇద్దరు తెలంగాణలో విజయం పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో అర్థమవుతుంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్ని ఆ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సరికొత్త ఎత్తులకు తెర లేపుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ఏయే నియోజకవర్గాల్లో ప్రజలు అధికార కార్పొరేటర్ల మీద వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. అసలెందుకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు? ఏయే అంశాల్నో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? వంటి విషయాలపై గట్టి ఫోకస్ పెడుతున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెల్చిన 99 సీట్లలో ఎక్కడ తమ పార్టీకి గెలవడానికి అవకాశాలున్న సీట్లపై గురి పెట్టారు. కాబట్టి, ఇప్పటికైనా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లకు సీట్లు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. వ్యతిరేకత ఉన్న వారిని పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త వారికి అవకాశాలివ్వాలి. వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని కేవలం గెలుపు గుర్రాలకే అవకాశమివ్వాలి.

GHMC ELECTIONS 2021

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here