కాంగ్రెస్‌, బీజేపీలకు అభ్యర్థులే కరువయ్యారు

106
KTR Slams Cong-BJP
KTR Slams Cong-BJP

KTR Slams Cong-BJP

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించటం ఒక అద్భుతం అని పేర్కొన్నారు . 2014 జూన్‌ నుంచి తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఎన్నికలో అద్భుతం జరుగుతోందన్నారు . ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన మేయర్లు, కౌన్సిలర్లు కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ విజయాన్ని అపహాస్యం చేస్తూ కొందరు మాట్లాడుతున్నారని ఇది ఓటేసిన ప్రజలను అవమానించడమేనని కేటీఆర్ తెలిపారు.
పంచాయతీ, జడ్పీ మండల పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ చారిత్రక విజయం సాధించిందని తెలిపారు. జడ్పీల్లో నూటికి నూరు శాతం సీట్లు సాధించడం దేశంలోనే ఓ చరిత్ర అన్న కేటీఆర్.. మున్సిపల్‌ ఎన్నికల్లో 130 సీట్లకు 122 సీట్లు సాధించడం మరో చరిత్ర అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కారు దూసుకుపోతుందన్నారు.సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నాటుకున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 9 స్థానాలు గెలుచుకోవడంతో ప్రతిపక్ష నాయకులు చంకలు గుద్దుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అదే కాంగ్రెస్‌, బీజేపీలకు అభ్యర్థులే కరువయ్యారని అన్నారు.

KTR Slams Cong-BJP,KTR,working president, trs party, bjp, congress, municipal elections, zptc elections, local body elections,After Emphatic Civic Poll Win

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here