నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్

36
Ktr Supports Realty 
Ktr Supports Realty 

Ktr Supports Realty

• కరోనా సంక్షోభ నేపథ్యంలో నిర్మాణ రంగ సంఘాలతో కేటీఆర్ భేటీ
• బిల్డింగ్ మరియు లేఔట్ల అనుమతులు సులభతరం 
• సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్
• అధిక మందికి ఉపాధి కల్పిస్తున్న నిర్మణా రంగానికి ప్రభుత్వం అండ
• సిమెంట్ ధరల పెరుగుదలపైన కంపెనీలతో చర్చించేందుకు హమీ
• ఇసుక సరఫరా సమస్యలపైన టియస్ యండిసితో మాట్లాడిన మంత్రి
• సంక్షోభంలో కార్మికుల సంక్షేమంలో నిర్మాణ సంస్ధలకు ధన్యవాదాలు
• కార్మికుల వివరాలు క్రోడీకరించాలని సూచన 
• మంత్రికి ధన్యవాదాలు తెల్పిన సంఘాల ప్రతినిధులు

ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభం నేపథ్యంలో హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని, దాని అభివృద్ధిని కొనసాగించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ అభివృద్ధి పథంలో కొనసాగుతూ వస్తుందని, హైదరాబాద్ సాధించిన వృద్ధిని కొనసాగించే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటుదని మంత్రి తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక అంశంగా ఉన్న నిర్మాణ రంగానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ మార్గనిర్దేశనం పైన చర్చించేందుకు ఈ రోజు ఆయన నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ అద్బుత మైన ప్రగతి సాధించాలన్నది తమ లక్ష్యంమన్న మంత్రి, ఈ అభివృద్ది క్రమానుగతంగా ఉండాలన్నారు. హైదరాబాద్ వృద్దిలో భాగస్వాములు కావాలని మంత్రి వారిని కోరారు. దీంతోపాటు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు.

* నగరంలో చెరువులు, ఇతర బహిరంగ ప్రాంతాల్లో మట్టి, నిర్మాణ వ్యర్ధాలను పారవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఉన్న ఇతర మెట్రో నగరాల్లో నిర్మాణ రంగ పరిస్థితి అయోమయంలో ఉన్న పరిస్థితుల్లోనూ హైదరాబాద్ నగరంలో మాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా నిర్మాణ రంగ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న ఉపశమన చర్యలు పైన వారు మంత్రితో చర్చించారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అప్రూవల్, మాస్టర్ ప్లాన్ అంశాలపైన ఈ సందర్భంగా మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు చేసిన సూచనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్, నిర్మాణ రంగానికి అండగా ఉంటామన్నారు. ప్రస్తుతం వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ రంగాన్ని ఆదుకోవాల్సి అవసరాన్ని తాము గుర్తిస్తున్నామని తెలిపిన మంత్రి, ఈ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రి నేరుగా ఈరంగంలోని ప్రతినిధులతో సమావేశం అయి, ఇచ్చిన మద్దతును ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. సంఘా ప్రతిధులు లెవనెత్తిన అంశాలపైన ప్రభుత్వంతో మాట్లాడి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.

* సిమెంట్ ధరల పెంపుకు సంబంధించిన అంశం పైన ఆందోళన వ్యక్తం చేసిన నిర్మాణ రంగ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. సిమెంట్ కంపెనీలతో ఇప్పటికే ఒకసారి సమావేశం అయ్యామని తెలిపారు. ఇసుక సరఫరాకు ఇబ్బందులు ఏదురవుతున్నాయన్నని పలువురు మంత్రి దృష్టికి తేవడంతో టియస్ యండిసి ఏండి మల్సూర్ తో మాట్లాడి హైదరాబాద్ నిర్మాణ రంగానికి సరిపడా ఇసుక నిల్వలుండేలా చూడాలని, నగరంలో ఉన్న స్టాక్ యార్డులనుంచి వీటి సరఫరా జరిగేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా సంక్షోభ సమయంలో అతిధి కార్మికుల విషయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలతో పాటు కలిసి వచ్చిన నిర్మాణ సంస్థల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. సంక్షోభ సమయంలో ప్రభుత్వంతో పాటు కార్మికుల యోగక్షేమాలు చూసుకోవడంలో నిర్మాణ సంస్థలు అందించిన సహకారం పట్ల అయన వారిని అభినందించారు. ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు ఇచ్చిన భరోసా వల్లనే చాల మంది కార్మికులు తిరిగి హైదరాబాద్లో పనిచేసేందుకు వస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం నిర్మాణ సైట్ల వద్ద పనిచేస్తున్న అతిధి కార్మికుల వివరాలను క్రోడీకరించి తమకు అందజేయాలన్నారు. తద్వారా సంక్షోభ సమయాల్లో సాధ్యమైనంత తొందరగా ప్రభావవంతంగా సహాయక చర్యలు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. దీంతోపాటు వన్ నేషన్- వన్ రేషన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి కూడా వివరాలు అవసరమవుతాయని మంత్రి కేటీఆర్ వారికి తెలియజేశారు.

* సంక్షోభ సమయంలో ప్రత్యేకంగా నిర్మాణ రంగ వృద్ది పట్ల ప్రత్యేక శ్రద్దతో ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మంత్రి కేటీఆర్ కు నిర్మాణ సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ రంగ అభివృద్ది కోసం ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు తాము మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు మన్ భూమ్ రామక్రిష్ణారావు, రాజశేఖర్ రెడ్డి, ట్రెడా అధ్యక్ష, కార్యదర్శులు చలపతిరావు, సునీల్ చంద్రారెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సీహెచ్ ప్రభాకర్ రావు, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి, ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ ఎండీ ప్రదీప్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Realty Industry

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here