కేటీఆర్ రాక.. భయం లేదిక..

TELANGANA GOVERNMENT APPOINTED SPECIAL TASK FORCE COMMITTEE TO DEAL WITH DAY TO DAY ACTIVITIES RELATED TO COVID OPERATIONS LIKE INJECTIONS, VACCINES SUPPLY ETC.

165
KTR TASKFORCE COMMITEE
KTR TASKFORCE COMMITEE

ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రజల్లో ఒకింత సంతోషం, భరోసా ఏర్పడింది. ఎందుకంటే, ట్వీట్ చేస్తే చాలు సమస్యల్ని పరిష్కరించిన ఘనత కేటీఆర్ కే దక్కుతుంది. ఆయన వద్ద సమర్థులైన అధికారులు, సిబ్బంది ఉండటం కలిసొచ్చే అంశం. ఈ టాస్క్ ఫోర్స్ లో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరిన సీఎం.

  • ప్రభుత్వ రంగంతో పాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను క్యాబినెట్ ఆదేశించింది. అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here