పట్టణప్రగతిపై మంత్రి కేటీఆర్

107
GREEN FRIDAY IN TELANGANA
GREEN FRIDAY IN TELANGANA
KTR to review for Pattana Pragathi
పట్టణ ప్రగతిపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మంత్రి కేటీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల మున్సిపల్ శాఖ పనితీరు మెరుగు పరచటానికి , ప్రశాలనకు నడుం బిగించిన కేటీఆర్ అధికారులను పట్టణ ప్రగతి ప్రోగ్రెస్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణా మున్సిపల్ మంత్రి కేటీఆర్ మునిసిపల్ కార్యాలయాల పనితీరుపై దృష్టి సారించారు. అధికారులకు చెమటలు పట్టిస్తున్నారు. ఒక పక్కన పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మునిసిపాలిటీలను పరిశీలిస్తూనే అధికారులను, కాంట్రాక్టర్ లను పరుగులు పెట్టిస్తున్నారు .ఇక రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి నిర్వహణా తీరుపై మాట్లాడారు.

ఆకస్మిక తనిఖీలతో హడలగొడుతున్న కేటీఆర్ నేడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో జిల్లాల అదనపు కలెక్టర్లు, పలు విభాగాల అధిపతులు, పురపాలక శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పట్టణాల మార్పే లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతి విజయవంతమైందని పేర్కొన్నారు . పట్టణాల్లో గుణాత్మకమైన మార్పుకు పట్టణ ప్రగతి తొలి అడుగుగా భావిస్తున్నామని చెప్పిన కేటీఆర్  పదిరోజుల కార్యక్రమం ద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన అనేక దీర్ఘకాలిక సమస్యలు గుర్తించామని , నూతన పురపాలక చట్టంపై అవగాహన పెంచడంలో పట్టణ ప్రగతి విజయవంతమైందని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణప్రగతిలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగికి ధన్యవాదాలు తెలిపారు.ఇక పట్టణాల్లో గుర్తించిన సమస్యలను ప్రణాళిక బద్ధంగా పరిష్కరించాలని చెప్పిన మంత్రి  పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా మర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని  అధికారులను ఆదేశించారు . పట్టణాల సమగ్రాభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పని చెయ్యాలని సూచించారు మంత్రి కేటీఆర్.

KTR to review for Pattana Pragathi,IT and Municipal minister, trs party, working president KTR, GHMC, pattana pragathi , municipality , sanitation, telangana, review

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here