పట్టణాభిషేకం పూర్తి.. పట్టాభిషేకం ఎప్పుడో?

149
KTR Will Be CM After Municipal Polls
KTR Will Be CM After Municipal Polls

KTR Will Be CM After Municipal Polls

తెలంగాణ రాజకీయాల్లో తెరాసా పార్టీకి తిరుగులేకుండా పోతుంది. టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌ట్లేదు. ఎన్నిసార్లు ఎన్నిక‌లొచ్చినా..టీఆర్ఎస్ పార్టీకే రాష్ట్ర‌ప్ర‌జ‌లు అధికారం అప్ప‌జెప్పుతున్నారు. అయితే ఇక్క‌డ టీఆర్ఎస్ పార్గీ బ‌లం బ‌ల‌హీన‌త‌లు ప‌క్క‌న‌పెడితే..ప్ర‌తిప‌క్షాలకు బ‌లం లేద‌న్న‌ది స్ప‌ష్టం. ఎవ‌రికి వారు సొంత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఆశిస్తూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుతున్నారు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు. ఇదే అదునుగా రాష్ట్రంలో తెరాసా ప్ర‌భుత్వం మ‌రింత ప‌టిష్టంగా ముంద‌కెళుతుంది. అయితే..కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాజ‌కీయాల్లో పెను మార్పు జ‌ర‌గ‌బోతుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ మార్పు ఎలా ఉండ‌బోతుందంటే ఏకంగా అధికార‌మే చేతులు మార‌బోతుంది మ‌రి. ఒక‌సారి తెలంగాణ రాజ‌కీయాల్లో వెలుగొందుతున్న టీఆర్ఎస్ పార్టీపై విశ్లేష‌ణ చేస్తే….

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాకా రాష్ట్ర ప్ర‌జ‌లు తెలంగాణ మొద‌టి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్‌ని ఎన్నుకున్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిలో కేసీఆర్ బాగా ఫేమ‌స్ అయ్యాడు. తెలంగాణ కోసం కేసీఆర్ మాత్ర‌మే పోరాటం చేశాడ‌న్నంత‌గా ఫేమ‌స్ అయ్యాడ‌నుకోండి. ఇప్ప‌డ‌ది వేరే విషయం. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే..గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ మ‌ళ్లీ సీఎంగా కేసీఆర్ ఎన్నిక‌య్యారు. దీంతో రాష్ట్రంలో తెరాసాకు తిరుగులేకుండా పోయింది. అయితే కేసీఆర్ ఉన్న‌ప్పుడే త‌న‌యుడిని ముఖ్య‌మంత్రిగా తీర్చిదిద్దాల‌నేది ఆయ‌న వ్యూహంలో ఒక‌టిగా చెప్తారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అందులో భాగంగానే మ‌రి కొద్ది రోజుల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి విష‌యంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు కేసీఆర్. ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, అటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు స్పష్టమైన మెజార్టీ రాకపోతే కేంద్రంలో ప్రాంతీయపార్టీలతో కలిపి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తాను ప్రధానిగా కావాలనుకున్నారు కేసీఆర్. అయితే అది సాధ్యపడలేదు. తాను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజ‌యం సాధించి మ‌రోసారి త‌న స‌త్తా చాటారు. అయితే అనంత‌రం జ‌రిగిన పార్ల‌మెంటు ఎల‌క్ష‌న్స్ తెరాసాను గ‌ట్టిగానే దెబ్బ‌కొట్టాయి. మ‌రీ ముఖ్యంగా కేసీఆర్ త‌న‌య క‌ల్వ‌కుంట్ల క‌విత ఓట‌మిపాల‌య్యారు. దీంతో కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్లైంది. దీంతో ఆయ‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అన్న ఆలోచ‌న‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన‌ట్లే క‌నిపిస్తున్నారు. అయితే కేటీఆర్‌ని ముఖ్య‌మంత్రిని చేయ‌డానికి స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నారు కేసీఆర్. అంటే యూపీఏ హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉండి, యూపీఏ ఛైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ ఎలా అయితే ఉన్నారో కేసీఆర్ కూడా రాష్ట్రస్థాయిలో అలాంటి పదవిని అధిష్టిస్తారని సమాచారం. అంటే కేసీఆర్ సోనియా స్థానంలో, కేటీఆర్ మ‌న్మోహ‌న్ స్థానం మాదిరిగా అన్న‌మాట‌.

ఇక‌పోతే త‌న‌యుడు కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిగా చేయాల‌న్న కేసీఆర్ వ్యూమంలో భాగంగా ముందుగా కేటీఆర్‌ని రాష్ట్రంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా తీర్చిదిద్దాల‌నుకున్నాడు. అందులో భాగంగానే ప్ర‌తి ఎన్నిక‌ల విష‌యంలో కేటీఆర్‌ను కీల‌కం చేశారు కేసీఆర్. ఇక‌పోతే తాజాగా తెలంగాణ‌లో మున్సిప‌ల్ పోల్స్ జ‌రిగాయి. ఈ పోల్స్ లో తెరాసా మ‌రోసారి స‌త్తా చాటింది. దాదాపు అన్ని ఏరియాల్లో తెరాసా విజ‌యం సాధించింద‌. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కారు పార్టీ పార్టీ జోరు మీద ఉండడంతో ఎక్కడలేని సంతోషంలో ఉంది టీఆర్ఎస్. ఇక ముందు ముందు కూడా ఇదే రకమైన వ్యూహాలతో ముందుకు వెల్తూ తమకు ఎదురు లేకుండా చేసుకోవాలని చూస్తోంది. అయితే ఇప్పుడా క్రెడిట్ అంతా కేటీఆర్‌కే ఇచ్చేస్తున్నారు తెరాసా పార్టీ నేత‌లు, శ్రేణులు, మంత్రులు సైతం. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం లాంఛనమే కేటీఆర్ పట్టాభిషేకం ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

KTR Will Be CM After Municipal Polls,#KTR,#KCR,#TRS,Will KTR Elected Telangana CM?,KTR Victory In Telangana Civics Polls,Telangana Politics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here