KCR Sensational Decision, KTR yuvasena was cancelled
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పేరుతో ఉన్న యువ సేన తో పాటు ఉన్న సేవా సంఘాలను అన్నింటినీ రద్దు చేసి నిజంగా అభిమానం వుంటే పార్టీ లో చేరి సేవ చెయ్యాలని పిలుపునిచ్చారు. చాలా మంది రాజకీయనాయకులు యువత తాము చేసే పనులకు ఆకర్షితులై తమ పేరు మీద సేవ చేసే సంఘాలుగా ఏర్పడితే సంతోషిస్తారు. కానీ కేటీఆర్ మాత్రం అలాంటి అభిమాన సంఘాలు కానీ మరే ఇతర సేవా సంఘాలు గానీ తన పేరు పెట్టుకుని చేస్తే ఊరుకోను అని స్పష్టం చేశారు. ఒక వేళ ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే పార్టీ లోకి వచ్చి పార్టీ పేరు మీద చెయ్యాలనికోరారు.. ఈ సంచలన నిర్ణయంతో ఆయన ఒక నిబద్దత కలిగిన రాజకీయ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. ఇక కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక గత అనుభవాలు , రాజకీయ అనుభవం తక్కువే అయినా టీఆర్ఎస్ పార్టీకి వ్యూహాలు మాత్రం ఎక్కువే. అందుకే వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు సంచలనం అవుతుంటాయి. తాజాగా అలాంటి కలకలం రేపే నిర్ణయం ఒకటి కేటీఆర్ తీసుకున్నారు. ఒరిజినల్ గా కేటీఆర్ ఏమో తెలియదు కానీ ఒక పొలిటీషియన్ గా మాత్రం నాలుగాకులు ఎక్కువే చదివారు కేటీఆర్ . తండ్రిలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న కేటీఆర్ చాలా మంది దృష్టిని తన నిర్ణయాలతో ఆకర్షిస్తున్నారు.
తాజాగా పార్టీ పదవీ బాధ్యతలు చేపట్టి దానిని బలోపేతం చేసే దిశగా కేటీఆర్ చురుగ్గా ఉన్నారు. నిర్వహణలో తన ముద్ర వేసుకోవడానికి తహతహలాడుతున్నాడు. పార్టీ శ్రేణులతో సమావేశం అవుతూ బిజీగా గడుపుతున్న ఆయన వద్దకు… కేటీఆర్ యువసేన పేరుతో కొందరు కార్యకర్తలు ఆయన వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి షాకిచ్చారు. కేటీఆర్ యువసేన సంఘాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా వారిని కోరారు . వారందరినీ టీఆర్ఎస్ లో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. ఇది వినగానే అందరికీ అబ్బ ఎంత మంచి స్ఫూర్తిదాయక విషయం అనిపిస్తుంది. ఈ నిర్ణయం వెనుక గతంలో జరిగిన ఒక సంఘటన ఉంది. కేసీఆర్ సేవా దళ్ పేరుతో ప్రజల్ని మోసం చేసిన ఆ సంఘం తాము చేసే దందాలకు ఏకంగా కేసీఆర్ పేరునే వాడుకుంది.
అందుకే ఇలాంటి సంఘాలను ఎంకరేజ్ చేయకూడదు అని ఒక వేళ నిజంగానే అభిమానం ఉంటే పార్టీ లో చేరి పార్టీ కార్యకర్తగా చెయ్యాలనుకున్న సేవ చెయ్యాలని చెప్పటం కేటీఆర్ ముందు చూపుకు నిదర్శనం. పార్టీ లో ఉండి ఏదైనా తప్పు చేస్తే జిల్లా నాయకత్వం గమనిస్తుంది. కాబట్టి అలా ఎవరు ఏమి చేసినా పార్టీ నుండే చెయ్యాలని చెప్పారు. తన పేరు మీద అభిమాన సంఘాలు గానీ , సేవా సంఘాలు గానీ పెట్టకూడదు అని స్పష్టంగా చెప్పారు. ఒకవేళ అలా పెట్టి వాటిని దుర్వినియోగం చేస్తే వాటిని మానిటర్ చెయ్యటానికి అవకాశంవుండదు కాబట్టే ఆయన పార్టీ నుండి పని చెయ్యమని చెప్పి అలాంటి సంఘాలను రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక మంచి నిర్ణయం . చాలా మంది అలా పాపులర్ అయిన పొలిటీషియన్ ల పేరుతో సేవ చేస్తామని చెప్పి దానికి బదులు చాలా చేస్తున్నారు. అలా దుర్వినియోగం చెయ్యకుండా ఉండటం కోసమే ఈ నిర్ణయం . నిజంగా వారు ఆ సంఘాల్ని రద్దు చేసినా , చెయ్యకున్నా కేటీఆర్ మాత్రం క్లారిటీ ఇచ్చారు. తన పేరు మీద ఏ సంఘాలు లేవు. వాటికి తనకు ఎలాంటి సంబంధం లేదు. వాటిని నమ్మి మోసపోకండి అని . చాలా తెలివైన నిర్ణయం ప్రకటించిన కేటీఆర్ ఇమేజ్ ఈ నిర్ణయంతో మరింత పెరిగింది.