ఉన్నావ్ కేసులో కుల్దీప్‌ దోషి

101
Kuldeep Sengar Found Guilty In Unnao Rape
Kuldeep Sengar Found Guilty In Unnao Rape

Kuldeep Sengar Found Guilty In Unnao Rape

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సెగార్‌ను దోషిగా తేల్చింది న్యాయస్థానం అయితే, ఈ నెల 19వ తేదీన శిక్ష ఖరారుపై వాదనలు విననుంది న్యాయస్థానం. ఆగస్టు 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టారు న్యాయమూర్తి ధర్మేష్ శర్మ. డిసెంబర్ 19న కులదీప్‌కు తీస్ హజారీ కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లక్నో కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు బదిలీ అయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌పై ఆరోపణలు రావడంతో ఆ పార్టీ అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఉన్నావో ఘటనపై జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ తన ఛాంబర్‌లోనే విచారణ ముగించారు. సీబీఐ కూడా ఈ కేసుకు సంబంధించిన సాక్షాధారాలతో వాదన వినిపించింది. దీంతో ఆగస్టు 5 నుంచి కేసును ప్రతి రోజూ విచారణకు చేపట్టారు.
బాలికను కిడ్నాప్ చేసినట్టు కుల్దీప్‌సింగ్ సెంగార్‌పై ఆరోపణలు వచ్చాయి.ఇక, అభియోగాల నమోదుకు 10 రోజుల ముందు కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది ఉన్నావ్ అత్యాచార బాధితురాలు. ఈ కేసులో మరో నిందితుడైన శశి సింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించారు. సెంగార్‌ను దోషిగా ప్రకటిచండంతో.. ఆయన కోర్టు హాలులోనే బోరున విలపించారు.

పోక్సో చట్టంలోని సెక్షన్‌ 5(సీ) మరియు ఐపీసీ 376 సెక్షన్‌ కింద సెంగార్‌ను దోషిగా నిర్ధారించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నో కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు కేసును బదిలీ చేశారు. ఈ కేసు ఢిల్లీ కోర్టుకు ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన బదిలీ కాగా, నాటి నుంచి రోజు వారీ విచారణ చేపట్టారు. తన దగ్గరకు పనికోసం వచ్చిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు కుల్దీప్‌ సెగార్‌ అనంతరం ఆమె కుటుంబసభ్యులను వివిధ రకాలుగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన ఢిల్లీ కోర్టు.. మాజీ ఎమ్మెల్యేను దోషిగా తేల్చింది. అయితే, కుల్దీప్ సెగార్‌ను బీజేపీ పార్టీ నుంచి 2019 ఆగస్టులో బహిష్కరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here