సినిమాలవల్లే అత్యాచారాలు…నేను ఒప్పుకోను  

Kushboo Against Kanimozhi Comments Over Gang Rapes

దేశవ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ సమయంలో డీఎంకే ఎంపీ కనిమొళి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలపై ఆమె స్పందించారు. ఈ మేరకు ఆమె ఏమన్నారంటే… అత్యాచారాలు సినిమాల వల్లే జరుగుతున్నాయని అన్నారు. సినిమాలో అశ్లీలత యువతని పెడదోవ పట్టిస్తుందన్నారు. అదేవిధంగా అత్యాచారాలకు ఉరి శిక్ష సరైనది కాదంటూ విద్య సంస్థల్లో లైంగిక విద్యా బోధన చాలా అవసరమంటూ ఆమె అభిప్రాయపడ్డారు. అయితే కనిమొళి చేసిన వ్యాఖ్యలపై నటి కుష్బూ స్పందించి కనిమొళి వ్యాఖ్యలను తప్పుబట్టారు. లైంగిక దాడులు సినిమా కారణంగా జరుగుతున్నాయంటే నేను ఒప్పుకోనన్నారు. అలానే జరిగి ఉంటె తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్ సినిమాలను ప్రజలు ఎందుకు ఆధరిస్తారంటూ ఆమె ప్రశ్నించారు. ఇలాంటి లైంగిక దాడులు ఆగాలంటే ముందు మహిళలు స్ట్రాంగ్ గా వ్యవహరించాలన్నారు. లైంగిక దాడికి పాల్పడేవారిపై ధైర్యంగా ఎదుర్కోవాలనేది ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం అని అన్నారు

Kushboo Against Kanimozhi Comments Over Gang Rapes,Kanimozhi Comments Over Gang Rapes,KushbooComments On Gang Rapes,Latest Gang Rapes,Actress Kushboo,DMK MP Kanimozhi

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article