భర్త, పిల్లల్ని వదిలేసి టిక్ టాక్ పిచ్చిలో…

lady came from delhi with tiktok addiction

టిక్ టాక్  పిచ్చి ఓ మహిళను భర్తను పిల్లల్ని వదిలేసి వచ్చేలా చేసింది .  ఢిల్లీ నుంచి హైద్రాబాద్ గల్లీకి రప్పించింది. భర్త ,పిల్లలను విడిచి వారం రోజులు టిక్ టాక్ యాప్ లో పరిచయం అయిన యువ బ్యాచ్ తో కలిసి ఉండేలా చేసింది ..ఆమె టిక్ టాక్ ఐడి తో  ఏం జరిగిందో భార్య ఎక్కడకు వెళ్లిందో కనిపెట్టిన  భర్త, చివరికి బేగంపేట ప్రకాష్ నగర్ లో ఆమె ఆచూకీ కనుగొన్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే ఢిల్లీకి చెందిన ఓ ఉద్యోగి భార్య,ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీలోని ఓ ఆర్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు. పని ఒత్తిడి తో భార్య ను కాస్త పట్టించుకోక పోవడంతో ఆమె టిక్ టాక్ యాప్ కు బానిసగా మారిపోయింది. ఈ తరుణం లో బేగంపేట ప్రకాష్ నగర్ కు చెందిన ఓ యువకుల బ్యాచ్ తో పరిచయం ఏర్పడింది. ఆమె తన సంసార కష్టాలు చెప్పుకోగా తమ వద్దకు రమ్మంటూ ఆహ్వానం పలికారు ఆ యువకులు. వస్తుందా ? లేక టైమ్ పాస్ చేసిందా ? అనుకునే లోపే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ చేరింది ఆ మహిళ. ఈ క్రమంలో ఏమి చేయాలో అర్థం కాని ఆ బ్యాచ్ ఆమెను ఓ ఫ్రెండ్ రూమ్ లో ఉంచారు. వారం రోజులుగా ఆమె ఇంటికి చేరక పోవడంతో భర్త ఆమె టిక్ టాక్ ద్వారానే విషయం తెలుసుకుని   ప్రకాష్ నగర్ చేరుకున్నాడు.

అతని రాక చూసి షాక్ తిన్న బ్యాచ్ ఏమి చెప్పాలో తెలియక ఆ మహిళ దగ్గరకు తీసుకెళ్ళారు. ఇన్ని రోజులుగా ఒక మహిళ ఆ రూమ్ లో ఉంటుందన్న విషయం తెలుసుకున్న కాలనీ వాసులు యువకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ పెద్దడవడంతో బేగంపేట పోలీస్ లకు సమాచారం అందించారు. ఐతే వారిని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు భార్య ను కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి భర్త తో ఢిల్లీ సాగనంపారు.

lady came from delhi with tiktok addiction,tik tok, social networking app , delhi, hyderabad

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article