Lady Ias Officer not taken leave her wedding
ఓ ఐఏఎస్ అధికారిణి వ్యక్తిగత జీవితం కంటే విధి నిర్వహణకే ఇంట్రెస్ట్ చూపింది. పెళ్లి అంటేనే జీవితంలో మరిచిపోలేని రోజు. ఆమె పెళ్లికి కూడా లీవ్ తీసుకోలేదు. దీంతో వరుడే వచ్చి పెళ్లి చేసుకున్నాడు. వధువుది హైదరాబాద్ కాగా, వరుడు పుణే వాసి. హైదరాబాద్‌కు చెందిన కీర్తి జల్లి 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం అస్సాం లోని చచర్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. పుణేకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య శశికాంత్‌తో పెళ్లి కుదిరింది.
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న జిల్లా కీర్తి విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అక్కడ రోజుకు 100 వరకు కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఈ టైంలో డ్యూటీని పక్కనబెట్టి, పెళ్లి కోసం హైదరాబాద్ వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. కీర్తి అధికారిక బంగ్లాలో ఎలాంటి ఆర్భాటాలూ లేకుండా వరుడు తాళికట్టాడు. కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకను జూమ్ వీడియో యాప్ ద్వారా 800 మంది చూశారు.