మళ్లీ లగడపాటి సర్వే?

LAGADAPATI SURVEY AGAIN

  • చంద్రబాబుతో అర్ధరాత్రి సమావేశం
  • ఏపీలో సర్వే చేసే అంశంపై సమాలోచనలు

సర్వేలతో పాపులర్ అయిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ తెర పైకి వచ్చారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సర్వే ఫలితాలు పూర్తిగా తారుమారు అయిన తర్వాత మీడియాకు కనిపించని ఆయన.. అనూహ్యంగా ఏపీ రాజధాని అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. ఓ ప్రతికాధిపతితో కలిసి సీఎం చంద్రబాబుతో సోమవారం రాత్రి సమావేశమయ్యారు. రాత్రి 10.30 నుంచి 12 వరకూ చంద్రబాబు వారిద్దరితో సమాలోచనలు జరిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి ఏపీలో సర్వే చేసే అంశంపై వారు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి లగడపాటి సర్వేలకు విశ్వసనీయత ఉండేది. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సర్వే బోర్లాపడింది. లగడపాటి సర్వేను నమ్ముకుని చాలామంది బెట్టింగులు కాసి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు. చంద్రబాబు సూచనల ప్రకారం మహాకూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలు మార్చేందుకు లగడపాటి శతవిధాలుగా ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఫలితాల తర్వాత ఆయన మీడియాకు చిక్కలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అమరావతిలో చంద్రబాబుతో ఆయన సమావేశం కాకవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో సర్వే చేయించి, ఆ ఫలితాలతో ప్రజలను ప్రభావితం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి.. తెలుగుదేశం పార్టీతో మాత్రం సత్సంబంధాలు కొనసాగించడం.. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం వంటి పరిణామాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article