లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల

LAKSHMI’S NTR TRAILER

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ వచ్చేసింది. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్న రామ్ గోపాల్ వర్మ.. బుధవారం కూడా ఓ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. రేపు ఉదయం 9.27 గంటలకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ట్రైలర్‌ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు’ అని అందులో పేర్కొన్నారు.

అలా చెప్పినట్టుగానే గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ మొదలైన ట్రైలర్‌.. ‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం’ అని ఎన్టీఆర్ అనడంతో ముగుస్తుంది. 1989 ఎన్నికలలో ఎన్టీఆర్‌ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అనే విషయాలను ఇందులో చూచించారు. వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ పై చెప్పులు పడిన సన్నివేశం కూడా ఇందులో ఉంది. ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన నిమిషాల్లోనే దాదాపు లక్ష వ్యూస్‌ రావడం విశేషం. జీవీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ సంగీతమందిస్తున్నారు.

TELUGU CINEMA

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article