కోర్టుపైనే కార్మికుల చివరి ఆశ

Last Hope Of The Workers On The Court

తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె 41వ రోజుకు  చేరుకున్నా ప్రభుత్వ వైఖరి మాత్రం ఏం మారలేదు. కార్మికుల హక్కుల సాధన కోసం వివిధ రూపాల్లో నిరసన తెలుపుతూనే ఉన్నారు. రాజకీయ పార్టీ నేతలు కూడా వారికి మద్దత్తు తెలుపుతున్నప్పటికి ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొన్నట్టు ఎక్కడా అంతగా కనిపించడం లేదు. అంతే కాకుండా కార్మికుల పక్షాన ప్రభుత్వాన్ని పెద్దగా ప్రశ్నిస్తున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. కార్మికుల తరుపున ప్రతిపక్షాల పాత్రను తెలంగాణ న్యాయస్దానం పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కార్మికులకు అండగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్షాలు చేసే ప్రయత్నాలను కూడా న్యాయస్దానమే చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.  అంతే కాకుండా సమ్మె అంశం న్యాయస్ధానం పరిధిలో ఉంది కదా అని ఏ ఒక్క నేత కూడా సమ్మె పట్ల గానీ, ప్రభుత్వ విధానం పట్ల గాని నోరు మెదపకపోడం సమ్మెలో వారి పాత్రను ప్రతిబింబిస్తోంది. దీంతో ఆర్టీసి కార్మికుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షపార్టీల నాయకులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలకన్నా ఎక్కువగా తెలంగాణ న్యాయస్దానం ప్రశ్నిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. దీంతో ఆర్టీసి కార్మికులు, జేఏసీ నాయకులు కూడా న్యాయస్దానం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోర్టుల ద్వారానే తమకు న్యాయం జరుగుతుందనే భరోసాను వ్యక్తం చేస్తున్నారు.ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు జోక్యం చేసుకున్న నాటినుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని సూచించింది. కానీ, ప్రభుత్వం దానిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమకిచ్చిన నివేదికలు కూడా తప్పుగా ఇస్తారా అని అక్షింతలు వేసింది. ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం పై హైకోర్టు ఒత్తిడి తెస్తుంది తమ సమస్య పరిష్కరిస్తుంది అన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.

tags : tsrtc strike, rtc strike, high court, rtc workers, trs, telangana government, opposition parties

తెలంగాణ వచ్చాకే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం

శబరిమలపై తీర్పు వాయిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *