హైదరాబాద్ అసిఫ్‌నగర్‌లో అర్థరాత్రి యువకులు వీరంగం సృష్టించారు. జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర గంజాయి మత్తులో యువకులు హల్‌చల్ చేశారు. నడిరోడ్డుపై వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కి వచ్చిన పోలీసులు అజయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే మత్తులో ఉన్న యువకులు పోలీసు వాహనంపైకి ఎక్కి నానా హంగామా చేశారు. పోలీసు వాహనంతోపాటు ఇతర వాహనాల అద్దాలు పగులగొట్టారు. స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు.