లావా ఫోన్ ఉండగా.. టీవీ ఎందుకు దండగ?

LAVA TV PHONE OFFER

  • మీ పాత టీవీ ఇచ్చి కొత్త ఫోన్ తీసుకెళ్లండి
  • లావా ఇంటర్నేషనల్ అదిరే ఆఫర్

మీ ఇంట్లో పాత టీవీ ఉందా? ఎందుకూ పనికిరాకుండా అది పడి ఉందా? అయితే, వెంటనే దానిని ఇచ్చేసి కొత్త ఫోన్ తెచ్చేసుకోండి. ప్రముఖ మొబైల్ కంపెనీ లావా ఇంటర్నేషనల్ సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. తన కొత్త ఫోన్ లావా జెడ్ 62 విడుదల సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తోంది. ‘త్రో యువర్ టీవీ’ అనే ఈ ఆఫర్ కింద మీ పాత టీవీని ఇచ్చి ఈ కొత్త ఫోన్ గెలుచుకోవచ్చని ప్రకటించింది. ఇందుకోసం వినియోగదారులు ఈనెల 18 మంగళవారం ఉదయం 10 గంటల నుంచి తమ వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాలని, అనంతరం విజేతల వివరాలను తాము ప్రకటిస్తామని వెల్లడించింది. విజేతలు తమ దగ్గర్లో ఉన్న లావా ఔట్ లెట్ కు వెళ్లి మీ టీవీ ఇచ్చి లావా జెడ్ 62 ఫోన్ తీసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు అదనంగా ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన పనిలేదని స్పష్టంచేసింది. ఇక లావా జెడ్ 62 ఫోన్ ఆరు అంగుళాల ఫుల్‌ వ్యూ (నాచ్‌ తక్కువగా ఉండే) ఐపీఎస్‌ డిస్‌ప్లే కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా గూగుల్‌ అసిస్టెంట్‌ కీ ఉంది. దీని సాయంతో కోరుకున్న యాప్‌ను వాయిస్‌ కమాండ్‌ ద్వారా ఓపెన్‌ చేసుకోవచ్చు. 3,380 ఎంఏహెచ్‌ ఆర్టిఫీషియల్‌ ఇన్‌టెలిజెన్స్‌ బ్యాటరీ, ఫేస్‌ అన్‌లాక్, 8మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్‌ ఏఐ స్టూడియో మోడ్‌ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.6,060.

MOBILE MARKET

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *