కేసీఆర్ కడుపులో కత్తులు పెట్టుకొని నోట్లో చెక్కెర పెడుతున్నాడు

Laxman Fires On KCR over Financial crisis

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో లక్ష్మణ్ఆర్థికమంత్రి ప్రమేయం లేకుండా ఆర్థికశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ హయాంలో మంత్రులకు ప్రాధాన్యత లేదని నొక్కి చెప్పారు. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారన్నారు.సీఎం కేసీఆర్‌ తీరు ఆవు తోలు కప్పుకున్న పులిలా ఉందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కడుపులో కత్తులు పెట్టుకుని.. నోట్లో చక్కెర పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పాలన పైన పటారం..లోన లొటారం అనే రీతిలో ఉందన్నారు.

ఇంటర్‌ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని, ఐదు వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయలేని పరిస్థితిలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు ఖాళీలు ఉన్నాయని.. ఆరేళ్లలో 30వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారన్నారు. టీఎస్‌పీఎస్సీ ఉనికి తెలంగాణలో ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు..ఐఆర్‌ లేదని లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ త్వరగా పెట్టింది ఏమీ లేదని, ఆర్థికంగా నష్టాల్లోకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఆరోపణలు గుప్పించారు.

Laxman Fires On KCR over Financial crisis,#CM KCR,Lakshman,BJP,#TRS,Telangana,Financial position,Telangana Politics,BJP Leader K Laxman,KCR solely responsible for financial mess,#TelanganaFinancialCrisis

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article