Laxman injured in RTC strike
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్నారు. ఈ రోజు బస్ భవన్ వద్ద శాంతియుతంగా ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మిక నాయకులను, వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం తోపులాటకు కారణం అయ్యింది. ఈ ఘటనలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ గాయపడ్డారు. ఆయన అంతర్గత అవయవాలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఆర్టీసీ జేఏసీ ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన లక్ష్మణ్ అక్కడ జరిగిన తోపులాటలో కింద పడిపోయారు. దీంతో లక్ష్మణ్‌కు గాయాలయ్యాయి. అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్స తీసుకున్న లక్ష్మణ్ తర్వాత నిమ్స్‌లో చేరారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అంతర్గత అవయవాలకు గాయాలైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. తాము ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బస్ భవన్ వద్ద శాంతియుత ధర్నా కార్యక్రమం నిర్వహించామని అయినా పోలీసులు తమని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. తన బట్టలు చిరిగి, గాయాలు అయ్యే విధంగా పోలీసులు ప్రవర్తించారని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆర్టీసీ కార్మికుల న్యాయ మైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాడతామన్నారు లక్ష్మణ్.
Tags: tsrtc, rtc strike, bjp, lakshman, bus bhavan, injured, admitted, hospital