లక్ష్మణ్ క్షమాపణ చెప్పాలన్న పొన్నం

Laxman Must Apologize Demands Ponnam Prabhakar

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పై కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ క్షమాపణ చెప్పాలని అన్నారు ఆ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. మంగళవారం గాంధీ భవన్ లో మాట్లాడిన పొన్నం.. కాంగ్రెస్ పార్టీని లక్ష్మణ్ తోక పార్టీ అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా మూడు వేల ఓట్లురాని బీజేపీ పార్టీ… కాంగ్రెస్ ను తోకపార్టీ అంటుందా అని ఫైర్ అయ్యారు. అడ్డిమారి గుడ్డి దెబ్బతో నాలుగు ఎంపీ సీట్లు గెలిచారని అన్నారు. ఆగస్టు 13న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ కు వచ్చి టీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేశారని.. ఆ వ్యాఖ్యలు  నిజమైతే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని కోరారు పొన్నం. లేదంటే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తోడుదొంగలేనని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని లక్షణ్ ను ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్ .  370 రద్దు, త్రిబుల్ తలక్ గురించి చెప్తూ  బీజేపీ పబ్బం గడుపుతుందని పొన్నం అన్నారు.

tags :ponnam prabhakar, Congress, Bjp, Dr.Laxman , trs,

గ్యాస్ సిలీండర్ పేలి ఇద్దరు మృతి

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article