Laxmi Rai : Metoo was Misleading
సినీ ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపిన మీటూ ఉద్యమం ఇప్పుడు తీవ్రతతో లేదు. దీనిపై హీరోయిన్ రాయ్‌లక్ష్మి తనదైన స్టైల్లో స్పందించారు. మీటూ ఉద్యమాన్ని ప్రజలు మరచిపోయారు. ఈ ఉద్యమం కొన్నిరోజులు కొనసాగి మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆశించినా జరగలేదు. నిజానికి మీటూ ఉద్యమంలో భాగంగా చాలా మంది మహిళలు తమకు ఎదురైన ఇబ్బందులను చెప్పారు. వారికి నేను గౌరవిస్తాను. అయితే కొందరు దీన్ని పక్కదారి పట్టించారు. నాకు బ్రేక్ ఇవ్వలేదు కదా.. నీ గురించి మాట్లాడుతా అంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో ప్రజలకు ఏదీ నిజమో, ఏదీ అబద్ధమో తెలియలేదు. ఇక ఇండస్ట్రీతో సంబంధం లేనివారికి అస్సలు ఏమీ అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చారు రాయ్‌లక్ష్మి.
Check out here For More News
For More Interesting and offers