లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ప్రధాని మోడీ పబ్లిసిటీ చేస్తున్నారన్న ఆర్జీవ

Laxmis NTR PM Modi Promotion by RGV

తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రెస్ ఎవరు అంటే అందరూ ఠక్కున చెప్పే పేరు రాం గోపాల్ వర్మ.. ఏ అంశంలో అయినా యిట్టె దూరిపోయే లేని పోనీ కాంట్రవర్సీ లు క్రియేట్ చేసే వర్మ తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తన సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నారని సంచలన ట్వీట్ చేసి పెను దుమారం రేపారు. సినీ ఇండ్రస్టీలో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టిస్తూ, వివాదాలతో తన సినిమాలకు పబ్లిసిటీ కల్పించుకునే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాణంలో ఉన్నారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలతో తెరకెక్కుతున్న తన సినిమాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం కల్పిస్తున్నారని ఆదివారం ఆర్జీవి ట్వీట్ చేశారు.
ఆర్జీవీ సినిమాకు మోడీ పబ్లిసిటీ ఏంటా ? అని చూస్తే…. గుంటూరు బీజేపీ సభలో ప్రధాని మోడీ ,చంద్రబాబు నాయుడు పై చేసిన ” వెన్నుపోటు” విమర్శల స్పీచ్ ఉన్న వీడియోను పోస్టు చేశారు ఆర్జీవీ. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పాటలను విడుదల చేసిన ఆర్జీవీ టీడీపీ నాయకుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక తాజాగా గుంటూరు లో జరిగిన మోడీ బహిరంగ సభ విజువల్స్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో కనిపించే అవకాశం లేక పోలేదు . ఈ సినిమా ట్రయిలర్ ను ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ఏది ఏమైనా ఆర్జీవీ సినిమా చంద్రబాబు టార్గెట్ గా సాగుతుంది అని ఆర్జీవీ తన పోస్ట్ ల ద్వారా చెప్తున్నారు. చూడాలి లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇలా వుంటే విడుదల అయితే ఇంకెంత దుమారం రేపుతుందో.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article