లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్

 Laxmis Ntr Trailer Release ….వారికి ఆర్జీవీ షాక్

పదవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయిన వారు వద్దు వద్దన్నా లక్ష్మి పార్వతి చేయి వదలని ఎన్టీఆర్ ప్రేమ, అనే కథ ను వాలంటైన్స్ డే సందర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ రూపం లో ఒక బండరాయి విసరబోతున్నాడు ఆర్జీవి. ఇది కుటుంబ కుట్రల చిత్రం అనే ట్యాగ్ లైన్ తో రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవంగా, తెలుగు ఖ్యాతిని నలుదిశలా చేరవేసిన ఎన్టీఆర్ లోలోని ఒక నిర్వీర్యమైన ప్రేమకథను లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఆవిష్కరించబోతున్నారు వర్మ. తుది శ్వాస వదలే వరకూ లక్ష్మీ పార్వతి తన గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్ జీవితం పై ఆమె ఎలాంటి ప్రభావం చూపించలేదు..? లక్ష్మీ కోసం తన అన్నీ పణంగా పెట్టి పోరాడిన ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ల మధ్య రహస్య సంబంధం ఏంటి? విడదీయరాని ఆ పవిత్ర బంధం ఎంటి..? ఇలాంటి అంశాలు కొందరికి రుచించకపోయినా, అవి తెలుగుప్రజల గొంతుల్లోకి దిగాల్సిన అవసరం ఉంది కనుకనే ఈ సినిమా తెస్తున్నామని చెప్పారు ఆర్జీవీ. తెలిసిన కథలో తెలియని కథనాన్ని వెలికితీయబోతుంది. రిలీజ్ కి వస్తున్న ఎన్టీఆర్ అసలు కథ తెలుగు తెరపై లక్ష్మీ ఆటం బాంబులను పేల్చడానికి సిద్దం అవుతోంది. వెలుగులు పంచిన వ్యక్తి చుట్టూ అలుముకున్న చీకట్లను తెరమీదకు తీసుకొస్తున్నాడు వర్మ.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలిపే ట్రైలర్ ను ఫిబ్రవరి 14 న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు చాలా మంది వెన్నులో పొడవబోతున్నాడు ఆర్జీవీ. ఎందుకంటే వెన్నుపోటు బేస్డ్ గా తీసిన సినిమా కదా …

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article