కాంగ్రెస్ కు సుధీర్ రెడ్డి గుడ్ బై

212
LB NAGAR MLA LEAVES CONG
LB NAGAR MLA LEAVES CONG

LB NAGAR MLA LEAVES CONG

  • కారెక్కనున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే
  • కేటీఆర్ తో భేటీ.. త్వరలో సీఎంతో సమావేశం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుదేలైన ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం మరింత దారుణంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వరుసగా పార్టీ వీడుతుండటం టీపీసీసీ పెద్దలను కలవరపెడుతోంది. ఇప్పటికే ఆరుగురు శాసనసభ్యులు కాంగ్రెస్ ను వీడాలని నిర్ణయం తీసుకోగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా ఇదే బాట పట్టారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి అధికార తెలంగాణ రాష్ట్రసమితి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో సుధీర్ రెడ్డి తన మనసులోని మాట బయటపెట్టారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరాలని భావిస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్.. సుధీర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. రెండు, మూడురోజుల్లో సీఎం కేసీఆర్‌తో సుధీర్‌రెడ్డి భేటీ అయి, టీఆర్ఎస్ లో చేరనున్నారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్‌ నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్‌ పూర్తి స్థాయి హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి ఇప్పటికే రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌), హరిప్రియ (ఇల్లెందు), సబితారెడ్డి (మహేశ్వరం), ఉపేందర్‌రెడ్డి (పాలేరు) టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. సుధీర్‌రెడ్డితో వారి సంఖ్య ఏడుకు చేరింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు సైతం కేటీఆర్‌ను కలిసినట్లు ప్రచారం జరిగింది. శని, ఆదివారాల్లో మరో ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

TS POLITICS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here