కేసీఆర్ కి ధన్యవాదాలు

128
Leaders of all BC caste groups thanked KCR
Leaders of all BC caste groups thanked KCR

హుజురాబాద్ నియెజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యమ నాయకుడు, బిసి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించిన నేపథ్యంలో అన్ని బిసి కుల సంఘాల నేతలు హైదరాబాద్లో మంత్రి గంగుల నివాసంలో మిడియా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా బీసీ కులాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, రాబోయే హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ నేతను ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కి ధన్యవాదాలు తెలిపారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జైటీఆర్ఎస్, జై గంగుల నినాదాలతో తమ సంపూర్ణ మద్దతును ముక్తకంఠంతో నినదించారు. బిసి సంఘాల నేతలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే బిసిలను గుర్తించి సముచిత ప్రాధాన్యం ఇచ్చిందన్నారు, రాష్ట్ర రాజదానిలోని అత్యంత విలువైన ప్రదేశంలో అన్ని కులసంఘాలకు భవనాలను కేటాయించడంతో పాటు కోట్లాది రూపాయల్ని భవన నిర్మాణాలకు కేటాయించడం హర్షణీయమన్నారు.

  • 250 యూనిట్ల ఉచిత కరెంటు, కుల వృత్తి పనిదారులకు ఆర్థిక సహాయం, అత్యుత్తమ నాణ్యమైన శిక్షణ, వివిద కార్పోరేషన్ల ద్వారా నాయీబ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేరు, పద్మశాలి, సగర, సంచార, వంశీరాజ్, శాలీవాహన తదితర కులసంఘాలకు ఆర్థిక సాయం అందజేయడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా బిసీల అభివృద్దికి టీఆర్ఎస్ పాటుపడుతోందని అన్నారు, ఆత్మగౌరవంతో పాటు సాధికారతను కల్పిస్తున్న కేసీఆర్ కి సంపూర్ణ మద్దతును తెలియజేశారు, రాబోయే హుజురాబాద్ ఎన్నికల్లో యువకుడు, ఉన్నత విద్యావేత్త, బిసి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ని గెలిపించుకుంటామన్నారు, కుల సంఘాల అద్యక్ష, కార్యద‌ర్శులతో పాటు ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రతీ సంఘం తరపున రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కే తమ సామాజిక వర్గాల మద్దతును తెలియజేస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ కు ఓటు వేయాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పారు.
  • ఈ కార్యక్రమంలో రజక సంఘాలకు చెందిన పి.కుమారస్వామి, సంజెగారి ఆంజనేయులు, నాయీబ్రాహ్మణ సంఘాలకు చెందిన రాచమల్ల బాలకృష్ణ, గడ్డం మోహన్, పెంబర్తి శ్రీనివాస్, కుమ్మరి సంఘాలకు చెందిన ఏ.వీరయ్య, కె.సుభాష్, ఎం.దయానంద్, ఏ.రాజలింగం. సగర సంఘాలకు చెందిన విజయేంద్రసాగర్, రవీందర్ సాగర్, అనిల్ సాగర్, రాజశేఖర్ రావు, వంశీరాజ్ కులానికి చెందిన సిహెచ్. బాలకృష్ణ, శాలివాహన సంఘానికి చెందిన ఎన్.నర్సింహా, ఇతర బిసి సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here