చిన్నారి ఉసురుతీసిన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

ELECTRICAL DEPARTMENT FAILURE KILLS SMALL KID

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక చిన్నారి ఉసురు తీసింది. పార్క్ లో ఆడుకుంటున్న చిన్నారి బాలుడు అక్కడ ఉన్న పోల్ ని పట్టుకుని కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌ బండ్లగూడలోని పెబెల్ సిటీ నివాస సముదాయంలో చోటు చేసుకున్న విషాద సంఘటన వివరాల్లోకి వెళితే….
ఆరేళ్ల బాలుడు మూసీన్ ఆడుకుంటుండగా కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని విద్యుత్ అధికారులు ప్రకటించారు. అయితే, పెబెల్ సీటీలో బాలుడు మూసీన్ విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెబెల్ సిటీ సొసైటీ సభ్యులు విద్యుత్ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article