లాంగ్ మార్చ్ కు వామపక్షాలు దూరం… రీజన్ ఇదే

LEFT NOT PART IN LONG MARCH

ఏపీలో జనసేన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం లాంగ్ మార్చ్ నిర్వహించనుంది. నవంబర్ 3 న విశాఖ వేదికగా నిర్వహించనున్న లాంగ్ మార్చ్ ద్వారా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చెయ్యాలని భావించింది. కానీ పవన్ ప్రయత్నానికి  ఆదిలోనే హంసపాదు అన్న చందంగా బీజేపీ పవన్ తో కలిసి సాగనని ప్రకటించింది. ఇక తాజాగా వామపక్ష పార్టీలు షాక్ ఇచ్చాయి.  ఇసుక కొరతపై నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న నేపధ్యంలోనే రాజకీయాలకు అతీతంగా, కార్మికులకు అండగా పవన్ ఈ కార్యక్రమానికి విపక్షాల మద్ధతు కూడా కోరారు.

అయితే ఇప్పటికే టీడీపీ,  తమ మద్దతును ప్రకటించింది. ఇక జనసేన అధినేత పవన్ బీజేపీ కూడా పాల్గొనాలని వారిని కోరారు. అయితే బీజేపీ నేతలు కొందరు ససేమిరా అంటున్నారు. కానీ కన్నా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే జనసేన నిర్వహిస్తున్న ఈ లాంగ్ మార్చ్‌కి ఉద్యమ పార్టీలైన సీపీఐ, సీపీఎం దూరంగా ఉంటున్నట్టు తెలిపాయి. రేపు విశాఖలో జరిగే లాంగ్‌మార్చ్‌కు తాము హాజరు కాలేమని సీపీఐ, సీపీఎం పార్టీ నేతలు రామకృష్ణ, మధు ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కి లేఖ రాశారు. ఈ కార్యక్రమానికి బీజేపీనీ కూడా ఆహ్వానించడం తమకు ఆమోదయోగ్యం కాదని వారు లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఇసుక కొరతపై తాము ఆందోళనలు చేపడుతూనే ఉన్నామని పవన్ కళ్యాణ్‌కి తెలిపారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article