దివాలా దిశగా లింగమనేని ఎస్టేట్స్

127
Lingamaneni Ramesh Insolvent Petition
#Lingamaneni Ramesh Insolvent Petition

Lingamaneni Ramesh Insolvent Petition

ఏపీ రాజధాని అమరావతి చుట్టూనే కాదు.. విజయవాడలోనే పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన లింగమనేని రమేష్ నష్టాల్లో ఉన్నానని దివాలా పిటీషన్ వేసినట్టు తెలుస్తుంది.  టీడీపీ అధినేత చంద్రబాబు కు తన గెస్ట్ హౌస్ ను అద్దెకు ఇచ్చిన వ్యవహారంతో లింగమనేని పేరు బయటకు వచ్చింది. ఏపీ ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (LEPL) దివాలా దిశగా పయనిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ వద్ద నవంబర్ 14వ తేదీన లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
లింగమనేని ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నష్టాల పాలైందని.. ఆ సంస్థకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు.. ఆర్థిక సంస్థలకు.. వ్యక్తులకు తిరిగి చెల్లించే పరిస్థితుల్లో తాము లేమన్న విషయాన్ని చెప్పినట్లుగా చెబుతున్నారు.తమ కంపెనీ తీవ్రమైన నష్టాలకు గురైనట్లుగా పేర్కొంటూ దివాలా పిటిషన్ ను దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. 2020 మే 12 నాటికి దివాలా ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. లింగమనేని రమేశ్ సామాన్యుడు కాదు. ఆయన ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికే పరిమితం కాలేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెప్పే ఆయన చేసిన వ్యాపారాల లిస్టు భారీగా ఉందని చెబుతారు. లింగమనేని రియల్ ఎస్టేట్ వెంచర్స్.. హౌజింగ్ ప్రాజెక్టులు.. ఎయిర్ కోస్టా విమాన సర్వీసులు.. పవర్ ప్లాంట్లు.. హెల్త్ కేర్.. ఎడ్యుకేషన్.. హోటల్స్.. ఇలా పెద్ద ఎత్తున ఆయన పలు వ్యాపారాలు చేసినట్లుగా చెబుతారు. నిజానికి లింగమనేని అడుగు పెట్టని వ్యాపారమే లేదన్నట్లుగా వ్యాపార వర్గాల అభిప్రాయం. అలాంటి ఆయన తాజాగా తాను తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయినట్లుగా పేర్కొనటం సంచలనంగా మారింది. బాబుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేశ్ దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లుగా వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
tags : lingamaneni ramesh, IP, insolvent petition, lingamaneni estates, chandrababu

ఇసుక దోపిడీపై దృష్టి పెట్టండి: పవన్

ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ టీఆర్ఎస్ కార్యకర్త?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here