* లోన్ యాప్స్ నిర్వాహకులపై కేసు పెట్టాలి
* బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలి
లోన్ యాప్ నిర్వాహకుల మానసిక వేధింపుల కారణంగా.. ఓ అమాయకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. కేవలం నాలుగంటే నాలుగే వేల రూపాయలు సకాలంలో చెల్లించని కారణంగా.. అతని బంధుమిత్రులందరికీ సమాచారం పంపించి.. అతన్ని మానసిక క్షోభకు గురి చేసి.. పరోక్షంగా అతను ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం దారుణమైన విషయం. వీరి వేధింపుల కారణంగా మరణించిన కుటుంబానికి లోన్ యాప్ నిర్వాహకులే నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.
రెచ్చిపోతున్నారు. రుణాలు తీసుకున్న వారిని తీవ్రంగా వేధిస్తున్నారు. వారి వేధింపులకు హైదరాబాద్‌లో మరో యువకుడు బలయ్యాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో మంగళవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ జియాగూడకు చెందిన రాజ్‌కుమార్.. ఆన్లైన్ యాప్ (Loan app) లో 12 వేల రూపాయల లోన్ తీసుకున్నాడు.. EMI ద్వారా 8వేలు చెల్లించాడు. మిగిలిన 4వేలు వెంటనే చెల్లించాలంటూ లోన్‌యాప్ నిర్వాహకులు ఒత్తిడి చేశారు. కాగా.. లోన్ తీసుకునే సమయంలో ఫ్రెండ్స్ ఫోన్ నంబర్స్‌ను రాజ్‌కుమార్ రిఫరెన్స్ కాంటాక్ట్స్‌గా ఇచ్చాడు. దీంతో అతని స్నేహితులకు, కుటుంబసభ్యులకు కూడా కాల్స్, మెసేజ్‌లు, ఆడియో రికార్డింగ్స్ పెట్టారు. వారికి వరుస కాల్స్, మెసేజ్‌లు రావడంతో చెల్లించాలని రాజ్ కుమార్ ను పలుమార్లు సూచించారు. దీంతో రాజ్ కుమార్ తీవ్ర మనస్తాపం చెందాడు. చివరకు లోన్ యాప్ నిర్వహకుల వేధింపులు తాళలేక.. రాజ్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివరాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజ్‌కుమార్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. లోన్ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రాజ్ కుమార్ కుటుం బసభ్యులు కోరుతున్నారు. కాగా.. లోన్ యాప్‌లో రుణాలు తీసుకొని చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో చాలామంది తీవ్ర మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా వేధింపులకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.