కాచిగూడ రైలు ప్రమాదంలో లోకో పైలెట్ శేఖర్ మృతి

Loco Pilot Shekhar Died In Kachiguda Train accident

కాచిగూడ రైల్వే స్టేషన్‌ లో జరిగిన రైలు ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకుంది.  ఎంఎంటీఎస్ రైల్లో ఇరుక్కున్న లోకో పైలెట్ శేఖర్ క్యాబిన్‌ లోనే దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదం జరిగిన దాదాపు రెండు గంటల వరకూ మాట్లాడుతూనే ఉన్న శేఖర్ ను బయటకు తీసేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేసి విఫలం అయ్యారు. రైలు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో, పైలెట్‌ ను బయటకు తియ్యటానికి చాలా సమయం పట్టిందని, ఈలోగా అతని పరిస్థితి విషమించిందని అధికారులు తెలిపారు. వైద్య బృందం చికిత్సను అందించినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తుంది . డీఆర్ఎఫ్ టీమ్‌ లు, గ్యాస్ కట్టర్ ల సాయంతో పైలెట్ ను బయటకు తెచ్చేందుకు శ్రమించామని వెల్లడించారు. శేఖర్ మృతి చెందినట్టు నిర్దారణ కావడంతో ఆయన కుటుంబీకుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
tags : kachiguda, loco pilot, mmts train, intercity train, sekhar, died

భీమిలిలో తన లవ్ స్టోరీ చెప్పిన రోజా

కాచిగూడలో రెండు రైళ్ల ఢీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *