పోర్టును తెలంగాణకు తరలిస్తారట

LOKESH LAUGHING STATEMENT

  • కేసీఆర్ అందుకే కష్టపడుతున్నారట
  • మళ్లీ అభాసుపాలైన లోకేశ్ వ్యాఖ్యలు

ఏపీ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్ మరోసారి అభాసుపాలయ్యారు. ఇప్పటికే పలుమార్లు వివిధ వేదికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించగా.. తాజాగా ఎన్నికల ప్రచారంలోనూ తన వ్యాఖ్యలను ఆయన అభాసుపాలవుతూనే ఉన్నారు. మొన్న ప్రచారంలో ఓసారి తాను పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గం పేరును సరిగా పలకలేక నెటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలతో జనం విస్తుపోయారు. ఏదో చెప్పబోయి తప్పులో కాలేశారు. కేసీఆర్ ఏపీ రావడానికి రెండే కారణాలని.. ఒకటి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుకొని, ముంపు మండలాలను తిరిగి వెనక్కి తిరిగి తీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక రెండో విషయం.. మచిలీపట్నం పోర్టు ను తెలంగాణకు తీసుకెళ్లడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారంతా అయోమయానికి గురయ్యారు. దీంతో సోషల్ మీడియాలో లోకేశ్ పై ట్రోలింగ్ పెరిగిపోయింది. లోకేశా! అది మానవమాత్రులకు సాధ్యం కాదు… దేవుడా!.. తెలంగాణలో అసలు సముద్రమే లేదు కదయ్యా!!… చంద్రబాబు అమరావతి కడితే కేసీఆర్‌ తీసుకుపోతాడని అందుకే కట్టడంలేదు.. అంటూ లోకేష్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article