9న ఎన్నికలు.. టీడీపీకే ఓటేయాలి

LOKESH TOLD WRONG POLL DATE

  • పోలింగ్ తేదీలో పొరపాటు పడ్డ లోకేశ్
  • వైరల్ గా మారిన తాజా వీడియో

ఏపీ మంత్రి నారా లోకేశ్ మరోసారి పొరపాటు పడ్డారు. ఇప్పటికే పలుమార్లు నోరు జారీ అభాసుపాలైన ఆయన.. తాజాగా పోలింగ్ తేదీని పొరపాటుగా చెప్పి నెటిజన్లకు దొరికిపోయారు. ఇప్పటికే ఆయనపై సోషల్ మీడియాలో జోకులు, వ్యంగ్య వీడియోలు హల్ చల్ చేస్తుండగా తాజాగా ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి బరిలో నిలిచిన లోకేశ్‌ గురువారం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరగనున్నాయని, అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. లోకేష్‌ వ్యాఖ్యలతో తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎన్నికలు తొమ్మిదో తేదీన కాదు, పదకొండున అని పక్కనే ఉన్న టీడీపీ నేతలు చెప్పడంతో లోకేశ్‌ కవర్‌ చేసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article