లోక్ సభలో 10 శాతం కోటా బిల్లు

Loksabha 10 percentage Kota bill

·         బిల్లుకు మద్దతిస్తామన్న మాయావతి

దేశంలోని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ దిశగా తన అడుగులను వేగిరం చేసింది. దీనికి సంబంధించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్ ఈ బిల్లను సభలో ప్రవేశపెట్టారు. ఈ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయసభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. లోక్ సభలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉండటం.. విపక్షాలు కూడా బిల్లుకు మద్దతు ప్రకటించడంతో ఇది సులభంగానే ఆమోదం పొందనుంది.  కాగా అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్వాగతించారు. రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజకీయ గిమ్మిక్కుగా ఆమె అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎస్సీఎస్టీఓబీసీల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని కూడా మాయావతి సూచించారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article