మధులిక కోలుకున్నాకే ఆమెకు పరీక్షలు

Madhulika will  Examined later– ఇంటర్ బోర్డు

ప్రేమోన్మాది భరత్ దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్య పరిస్థితి ఇంకా సీరియస్ గానే ఉంది. ప్రస్తుతం ఆమె సెప్టిసీమియా ఇన్ఫెక్షన్ తో బాధపడుతోంది. వైద్యులు ఆమె ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఐసీయూలోనే ఉన్న మధులిక ఇంటర్మీడియట్ పరీక్షల సమయానికి కోలుకునే పరిస్థితి లేదు. కనుక మధులిక విషయంలో ఇంటర్ బోర్డు సానుకూలంగా స్పందించింది. ఐసీయూలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న మధులిక పూర్తిగా కోలుకుని ఎప్పుడుపరీక్షలు రాస్తానని చెబితే అప్పుడే ఎగ్జామ్స్ పెడతామని బోర్డు కార్యదర్శి అశోక్ హామీ ఇచ్చారు.ఈ విషయంలో అశోక్‌ని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నేతలు కలిసి సమస్యని విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఎప్పుడూ చదువులో ఫస్ట్ ఉండే మధులిక ఊహించని పరిణామంతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన సమయంలో ప్రాణాల కోసం పోరాడుతోంది. పరీక్షలు రాయాల్సిన తరుణంలో అగ్నిపరీక్షను ఎదుర్కొంటోంది. చదువుల తల్లి మధులిక త్వరగా కోలుకోవాలని అటు తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు కోరుకుంటున్నారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కన్న మధులిక పరీక్షలు రాయడానికి ప్రత్యేక అనుమతినిచ్చి ఇంటర్మీడియట్ బోర్డు సైతం ఔదార్యం చూపింది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article