మధులిక కండీషన్ సీరియస్ ….15చోట్ల కత్తి పోట్లు

MADULIKA CONDITION IS SERIOUS

బర్కత్ పురాలో మధులిక అనే మైనర్ బాలిక పై ప్రేమ పేరుతో భరత్ అనే ప్రేమోన్మాది దాడి చేసిన ఘటనలో గాయపడిన యువతి మధులిక ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. శరీరంలో 15 చోట్ల కత్తి గాయాలు ఉన్నాయని వెల్లడించారు. రక్తం ఎక్కువగా పోయిందని.. చికిత్సకు సహకరించటం లేదంటున్నారు డాక్టర్లు. కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు వైద్యులు. వెంటిలేషన్ పై చికిత్స కొనసాగిస్తున్నారు. మూడు రోజులు గిడిస్తేనే ఏ విషయం చెప్పలేం అంటున్నారు డాక్టర్లు. మెడ భాగంలో లోతైన గాయం అయ్యింది. చేతి వేళ్లు తెగిపోయాయి. కొన్ని నరాలు కూడా కట్ అయ్యాయి.
చికిత్స కోసం ప్రత్యేక వైద్య బృందం పని చేస్తోంది. అవసరం అయిన ఆపరేషన్లు చేస్తోంది. మధులిక ప్రస్తుతం స్పృహలో కూడా లేదని చెబుతున్నారు డాక్టర్లు. బ్రెయిన్ – వెన్నుపూస మధ్య ఫ్రాక్చర్ అయ్యిందని.. ఆపరేషన్ చేయాలి అంటున్నారు. రెండు, మూడు విడతలుగా శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందన్నారు. శరీరంపై ఉన్న గాయాలు లోతుగా ఉండటంతో.. చికిత్సకు సమయం పడుతుంది అంటున్నారు డాక్టర్లు. బర్కత్ పురాలో మధులిక అనే మైనర్ బాలిక పై ప్రేమ పేరుతో దాడి చేసిన ప్రేమోన్మాది భరత్ ను పోలీసులు అరెస్టు చేసారు. ఈ సాయంత్రం అతడ్ని మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. భరత్ చేసిన దాడిలో మొత్తం 15 చోట్ల బాలిక శరీరం పై గాయాలయ్యాయని, చికిత్సకు శరీరం సహకరించటంలేదని డాక్టర్లు చెపుతున్నారు. వెంటిలేషన్ పై ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, 72 గంటలు గడిస్తే కానీ పరిస్ధితి ఏమీ చెప్పలేమని మలక్ పేట యశోదా ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.
ఈస్ట్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆధ్వర్యంలో, 4 టీమ్ ల ద్వారా గాలింపు జరిపి కాచిగూడ ప్రాంతంలోని ఒక ఇంటిలో తలదాచుకున్న భరత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై దాడి చేసిన తర్వాత నిందితుడు కాచిగూడ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించటం, భరత్ సంచరించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజి ఆధారంగా భరత్ కదలికలు కనిపెట్టిన పోలీసులు ఒక ఇంటిలో తలదాచుకున్న భరత్ ను అదుపులోకి తీసుకున్నారు. మధులిక పై దాడి చేసేందుకు ఉపయోనగించిన కొబ్బరి బొండాల కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.భరత్ సెల్ పోను ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article