పార్టీ మార్పుపై టీడీపీ నేత మాగుంట ఏమన్నారంటే

Maganti Responded on party change

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది . ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలోకి ప్రజల మద్దతు కోసం వెళ్తున్నాయి. సభలు సమావేశాలతో తమదైన స్టైల్లో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తు చేసే విధంగా పావులు కదుపుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ లోని బలమైన నాయకులను ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు నేతలు. ఇక ఇదే సమయంలో పార్టీల్లో ఉన్న నేతలపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.పార్టీ మారకుండానే పార్టీ మారుతున్నట్టు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.
ఇక ఇదే క్రమంలో గతకొంత కాలంగా ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలో చేరి ఒంగోలు లోక్ సభకు పోటీ చేస్తారని జిల్లావ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. దీంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రూమర్లకు వివరణ ఇచ్చారు.. తహాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోనని తెలిపారు. తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకూ ఆదరిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటానని, ఇదే ఆదరాభిమానాలను రాబోయే ఎన్నికల్లోనూ చూపించి నన్ను గెలిపించండి అంటూ క్యాడర్ కు క్లారిటీ ఇచ్చేశారు. కాగా ఒంగోలులో శనివారం పింఛన్ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ విషయాలపై స్పష్టత ఇచ్చారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన పింఛన్‌దారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article