యాదాద్రిలో మహా సుదర్శనయాగం

MAHA YAGAM IN YADADRI

పూజలు, యాగాల పట్ల అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగానికి సిద్ధమవుతున్నారు. త్వరలో యాదాద్రిలో మహా సుదర్శనయాగం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ యాగానికి సంబంధించిన అంశాలపై మంగళవారం ఆయన త్రిదండి చినజీయర్ స్వామితో చర్చించారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఉన్న స్వామి ఆశ్రమానికి వెళ్లిన కేసీఆర్.. యాగం నిర్వహణపై ఆయనతో చర్చించారు. విశాలమైన యజ్ఞ వాటికలో యజ్ఞ 1048 కుండాలతో.. 3 వేల మంది రుత్వికులు, మరో 3వేల మంది సహాయకులతో మహాయాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలు, బద్రీనాథ్, శ్రీరంగం, జగన్నాథ్‌, తిరుపతి నుంచి మఠాధిపతులను ఆహ్వానించాలని నిర్ణయించారు. అలాగే, కేంద్రం, రాష్ట్రాల పెద్దలు, గవర్నర్లను ఆహ్వానించనున్నారు. ఈ యజ్ఞం నేపథ్యంలో లక్షలాది సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పక్కాగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై చర్చించారు. సీఎం వెంటనే మై హోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు ఉన్నారు.

TS NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article