మహాకూటమి కథ కంచికి

MahaKutami Katha Kanchiki

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏర్పడిన మహా కూటమి కథ ముగిసినట్టేనా? పంచాయతీ ఎన్నికల్లో, అలాగే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మహాకూటమి పొత్తులు ఇక లేనట్టేనా? టిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి ఏర్పడిందని చెప్తున్నా మహా కూటమి సినిమా అసెంబ్లీ ఎన్నికల తోనే ముగిసినట్టేనా? అంటే అవును అనే సమాధానాలే వస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికల్లో విపరీతమైన అంచనాలు పెంచిన మహాకూటమి .. ఫలితాల దగ్గరికొచ్చేసరికి బోల్తాపడింది. ఘోరమైన ఓటమిని ఎదుర్కొంది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణసమితి పార్టీలు కూటమిగా ఏర్పడి.. తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేశాయి. కాంగ్రెస్ 19 స్థానాల్లో, టీడీపీ 2 స్థానాల్లో గెలుపొందాయి. తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి. దీంతో కూటమి కొనసాగింపుపై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటివరకూ ఓటమిపై కూటమినేతలు సంయుక్తంగా స్పందించలేదు. పార్టీలుగా ఫలితాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికగా.. పార్టీలన్నీ ఒకేవేదికపై వచ్చి కూటమిగా స్పందించలేదు. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి కొనసాగుతుందా? లేదా?అనే సందిగ్ధత నెలకొంది.
తాజాగా, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలు.. కూటమి కొనసాగింపుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఫలితాలు వచ్చి ఇన్ని రోజులైనా ఇప్పటివరకూ ఓటమిపై కూటమిలో చర్చ జరగలేదని కోదండరాం అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి ఉంటుందా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. తాము మాత్రం పార్టీగా మనుగడ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలపై టీజేఎస్‌కు అంతర్గత ఆలోచన ఉందని చెప్పారు. ప్రజాసమస్యలపై తమ గొంతు వినిపిస్తామని, అందుకు తగినట్టు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. కోదండరాం వ్యాఖ్యల ప్రకారం… తెలంగాణలో మహాకూటమి కథ ముగిసినట్టేనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.

Check out MS DHONI Signed Bat CLICK HERE

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article