Mahamad siraj good spell
నిన్న జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ కు చెందిన ఆటగాడు సిరాజ్ సత్తా చాటాడు. మహ్మద్ సిరాజ్ దెబ్బకు కోల్‌కతా కుప్పకూలింది. ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరచుకోవాలంటే నెగ్గాల్సిన కీలక మ్యాచ్‌లో చతికిలపడింది. సిరాజ్ దెబ్బకు స్కోరు బోర్డుపై కనీసం వంద పరుగులైనా ఉంచలేకపోయింది. స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకొని విమర్శలపాలైన యువ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈసారి మాత్రం అదిరే ప్రదర్శనతో అందరిచేతా శభాష్ అనిపించుకున్నాడు.
నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతూ అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసి అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో ఒకే మ్యాచ్‌లో రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు. పేసర్ సిరాజ్ (4-2-8-3) అద్భుత ప్రదర్శనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఘన విజయాన్ని సొంతం చేసుకొంది. బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. కోల్‌కతా వెన్నువిరిచిన సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.