Mahanayaku Movie may postpone
ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం `యన్.టి.ఆర్ మహానాయకుడు`లో ఆయన రాజకీయ ప్రస్థానం గురించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే రీసెంట్‌గా విడుదలైన ఆయన బయోపిక్ తొలి భాగం `యన్.టి.ఆర్ కథానాయకుడు` బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకోవడంలో విఫలమైంది. డిస్ట్రిబ్యూటర్స్ బాగానే లాస్ అయ్యారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు రెండో భాగంపై పడనుంది. తొలిభాగం కొన్నవారికే రెండో భాగాన్ని ఇచ్చి ఆ నష్టాలను పూడ్చాలనుకుంటున్నారట. తొలి భాగంపై వచ్చిన విమర్శల కారణంగా రెండోభాగంపై దర్శక నిర్మాతలు ఎక్కువగా ఫోకస్ పెట్టారట. అందుల్ల `యన్.టి.ఆర్ మహానాయకుడు` అనుకున్న సమయం విడుదల కాలేకపోవచ్చుననే వార్తలు వస్తున్నాయి. మరి యూనిట్ దీనిపై అధికారికంగా సమాచారం ఏమని ఇస్తుందో చూడాలి.