మహారాష్ట్ర అమ్మాయిని హైదరాబాద్లో రేప్

166
Maharashtra Girl Raped In Hyderabad
Maharashtra Girl Raped In Hyderabad

Maharashtra Girl Raped In Hyderabad

నిరుద్యోగం ఆసరాగా చేసుకుని ఒక యువతిని  ట్రాప్ చేసి రేప్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ట్రైన్ లో పరిచయం అయిన అమ్మాయిని  ఉద్యోగం ఇస్తామని నమ్మించి తన ఫ్రెండ్ సహాయం తో లాడ్జ్ కి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి అక్కడి నుండి పారిపోయారు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడం తో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది.

అసలేం జరిగిందంటే  పూజ అనే యువతి జాబ్ కోసం మహారాష్ట్ర నుంచి నగరానికి ట్రైన్లో వస్తుండగా మధ్యలో వివేకానంద అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. ఆమెతో మాటల్లో ఆమె ఉద్యోగం కోసం వెళ్తుందని తెలుసుకున్న సదరు కేటుగాడు ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి తన ఫ్రెండ్ రాజుతో కలిసి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న శ్రీ కృష్ణ లాడ్జి కి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత చిన్నగా అక్కడి నుండి ఆ ఇద్దరు మృగాళ్లు జారుకున్నారు. ఆ సంఘటన నుండి కొద్ది సేపటి తరువాత తేరుకున్న యువతి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులపై సెక్షన్ 376, 506 కింద కేసులు నమోదు చేసి వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Maharashtra Girl Raped In Hyderabad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here